Kalvakuntla Sanjay | సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండించారు. వీణవంకలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన కౌశిక్ రెడ్డి, ఆయన భార్యాబిడ్డలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. వీణవంక సర్పంచ్ అయిన దళిత మహిళను జుట్టు పట్టుకుని లాగడం దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు.
ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటు అని కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి…. నిన్ను ప్రశ్నించే వారు అంటే ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా ? మహిళలని, దళితులను, భక్తులని కూడా వదలవా అని నిలదీశారు. తెలంగాణ ప్రతి మహిళా సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో నీకు బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
వీణవంకలో సమ్మక్క–సారలమ్మ మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన
హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి గారిని, వారి భార్య బిడ్డను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం మరియు వీణవంక సర్పంచ్ అయిన దళిత మహిళను జుట్టు పట్టుకొని లాగడం దుర్మార్గమైన చర్య!ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటు!
రేవంత్ రెడ్డి….… pic.twitter.com/89PwBBp9wg
— Dr Sanjay Kalvakuntla (@drsanjayBRS) January 30, 2026
తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీక్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రా గానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.
‘ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్లనివ్వడం లేదు’ అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, వీణవంక జాతరకు వెళ్లొద్దనే ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే స్వేచ్ఛ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో లేదా? అని ప్రశ్నించారు. కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖ రెడ్డితో కలిసి కరీంనగర్-వరంగల్ రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని మద్దతు పలికారు. సుమారు గంటపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో పోలీసులకు, కౌశిక్‌రెడ్డికి మధ్య తీవ్ర వా గ్వాదం జరిగింది. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది.
ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతం వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డు సభ్యుడిగా గెలువని ఓ అనామకుడికి సీపీ, ఏసీపీలు గులాంగిరీ చేయ డమేమిటని ప్రశ్నించారు. అధికారం చేతి లో ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హుజూరాబాద్‌లో నిర్బంధం, ఆందోళనల తర్వా త సాయంత్రం ఎమ్మెల్యే జాతర వె ళ్లేందు కు పోలీసులు అనుమతించగా, కు టుంబ సభ్యులతో కలిసి వీణవంక వెళ్లారు. స్థానిక సర్పంచ్ దాసారపు సరోజనతో కలిసి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. అమ్మవారి వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వకుండా పేద దళిత మహిళా సర్పంచ్‌ను అడ్డుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతరం గద్దెల వద్ద నుంచి కిందికి దిగాలని ఎమ్మెల్యేతోపాటు సర్పంచ్‌కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించగా, వారు దిగకపోవడంతో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి సైదాపూర్ ఠాణాకు తరలించారు. కాగా, ఎమ్మెల్యే సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖను ఏసీపీ మాధవి పోలీసులతో క లిసి అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు.