హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలిపై మంత్రి కొండా సురేఖ ప్రజా భవన్లో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే సాయంత్రం సచిన్ సావంత్‌ను కడియం శ్రీహరి సైతం కలువనున్నారు. కాగా, మంత్రి సురేఖకు తెలియకుండానే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించిన విషయం తెలిసిందే.
దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియంపై స్టేట్ కమాండ్‌కి కాకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సచిన్ సావంత్ ఇరువురితో మాట్లాడనున్నారు.