ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై కూడా ఐపీఎల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజిల్‌వుడ్ బౌలింగ్ వేసే సమయంలో ఫీల్డ్ అంపైర్‌తో స్టోయినిస్ వాగ్వాదానికి దిగాడు. వైడ్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి తప్పుగా భావించి మేనేజ్మెంట్ అతడిని మందలించి వదిలేసింది. ఆ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాహుల్ జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి. ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.