హైదరాబాద్, జూలై 20(నమస్తే తె లంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా మాజీ ఎంపీ కే కేశవరావు శనివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కా ర్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలె యాదయ్య, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
‘క్రిప్టో’ మోసగాడి అరెస్టు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తె లంగాణ): తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్‌లో క్రిప్టో ట్రేడింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరస్థుడిని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) పోలీసులు అరెస్టు చేసినట్టు ఏడీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. అతని నుంచి సు మారు రూ.లక్షా 58 వేల నగదు, సెల్ఫో న్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. క రీంనగర్కు చెందిన బాధితుడు సాయికృష్ణగౌడ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి ది గిన సీఎస్బీ సిబ్బంది నిందితుడు అరుణ్చౌదరిని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శు క్రవారం అరెస్టు చేశారు. అక్కడ మేజిస్ట్రే ట్ ఎదుట హాజరుపర్చి ట్రాన్సిల్ వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకొచ్చినట్టు శిఖాగోయెల్ చెప్పారు. నిందితుడిని జ్యుడీషయ ల్ కస్టడీ కోసం కరీంనగర్ న్యాయస్థానం లో హాజరుపర్చారు. ఇతనికి గత ఏప్రిల్ లో సాయికృష్ణగౌడ్ రూ.లక్షా 58 వేల నగదు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపారు.