హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో మరో కొత్త వివాదం రాజుకుంది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో చతికలపడటంతో సతమతమవుతున్న పార్టీలో ప్రధాని మోదీతో భేటీ అంశా లు లీక్ అవడం అగ్గిరాజేసింది. రాష్ర్టానికి చెందిన ఎంపీలకు ఇటీవల ఢిల్లీలో ప్రధాని అల్పహార విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అధికార పార్టీతో స్నేహ‘హస్తం’ ఏంటీ..? అని సొంత పార్టీ ఎంపీలను కడిగిపారేశా రు. ఇక ఈ అంశాలన్నీ లీక్ కావడం కాషాయ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.