ఖమ్మం కల్చరల్, మే 10: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కులు, సామాజిక న్యాయ మిషన్ (హెచ్ఆర్ఎస్జేఎం) గౌరవ డైరెక్టర్‌గా మిసెస్ యూనివర్స్ మహ్మద్ ఫర్హా నియామకమయ్యారు. ఖమ్మానికి చెందిన ఫర్హా ఇంతకాలం ఈ మిషన్‌కు కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఈ మేరకు హెచ్ఆర్ఎస్జేఎం జాతీయ అధ్యక్షుడు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా సాధికారత, మానవ హక్కుల కోసం మిసెస్ యూనివర్స్ ఫర్హా కొన్నేళ్లుగా విశేష సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అరుదైన పదవిలో ఆమెను నియమించినట్లు చెప్పారు. మిసెస్ ఇండియాగా, మిసెస్ ఫొటోజెనిక్‌గా, మిసెస్ యూనివర్స్‌గా అందం, ప్రతిభ, సేవలతో ఖమ్మం ఖ్యాతిని చాటుతున్న ఫర్హా ప్రస్తుతం అరుదైన ఈ పదవిని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశమంతటా విద్య, మహిళల హక్కులు, సాధికారత, సామాజిక సేవల కోసం కృషి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ మిషన్ నిర్వహించే అనేక చైతన్య, సేవా కార్యక్రమాలతోపాటు, సమాజంలో నైతిక సంస్కృతిని పెంచి సామాజిక దురాచారాలను పారదోలడానికి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు.