కొణిజర్ల, మే 10: త్వరలో రూ.వంద కోట్లతో మండలంలో సీసీ రోడ్లు నిర్మించనున్నామని, మండలానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మండలంలోని సింగరాయపాలెంలో టీఆర్ఎస్ నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, సీపీఎం నుంచి సుమారు 40 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే రాములునాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా భారీ బైక్ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని అన్నారు. అనంతరం స్థానిక నాయకులు అక్కడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జాగిర్దారీ భూములకు పట్టాలు, సీసీ రోడ్లు, అంతర్గత సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చింతనబోయిన బాలయ్య, మంకెన పెద్దపుల్లయ్య, గోగుల ముత్యం, రాంబాబు, సైదులు, వసంతం, వెంకటేశ్వర్లు, బొల్లెపోగు వెంకటి, పగిళ్ల వంశీ, నరసింహారావు, మల్లెల బాబు, చింతనబోయిన నరసింహారావు, నరసింహా, రామారావు, తిరుపతిరావు, పోరళ్ల రాంబాబు, మేడి నరేశ్, మధు, లాలయ్య, రాములు, కృష్ణ, నారాయణ తదితరులు ఉన్నారు.
స్థానిక టీఆర్ఎస్ నాయకుడు అనారోగ్యానికి గురికాగా ఆయనను పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏలూరి శ్రీనివాసరావు, సురభి వెంకటప్ప, గోసు మధు, బీడీకే రత్నం, వై.చిరంజీవి, చెరుకుమల్లి రవి, పోట్ల శ్రీనివాసరావు, కోసూరి శ్రీనివాసరావు, బండారు కృష్ణ, పరికపల్లి శ్రీను, రాయల పుల్లయ్య, దొడ్డపునేని రామారావు, మూడ్ సురేశ్, బూరా ప్రసాద్, రహీం, చిన్నపుల్లయ్య, మట్టా శ్రీను, అలవాల తిరుమలరావు, గన్ను, ధరావత్ బాబులాల్, అద్దంకి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.