పాల్వంచ, మార్చి 9 : అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 91,142 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా నిరుద్యోగులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. యువత పెద్దఎత్తున కదలివచ్చి పటాకులు కాల్చి, డప్పులు, నృత్యాలతో స్వీట్లు పంచుకుంటూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం, పూలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. పాల్వంచ పట్టణంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీను, రాకేశ్, సుధాకర్, నగేశ్, సందీప్, రిషిబాబు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ కార్యాలయంలో..
కొత్తగూడెం అర్బన్, మార్చి 9 : దిశా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని రైటర్‌బస్తీలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎంతోమందికి మేలు కలిగే విధంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు శుభం కలగాలని, సీఎం నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయన చిత్రపటానికి దిశా కమిటీ మెంబర్ కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. జూలూరి రఘుమాచారి, రియాజ్, యాదగిరి, కృష్ణ, శిరీష, సంధ్య, మేదరమెట్ల పురుషోత్తం, సతీశ్, సంతోష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో..
కొత్తగూడెం అర్బన్, మార్చి 9 : కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు ఊరటనిచ్చే విధంగా సీఎం చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామన్నారు. పట్టణ మాజీ అధ్యక్షుడు బండి రాజుగౌడ్, ఎండీ హుస్సేన్, సాంబ పూర్ణచంద్రరావు, కలకోటి ఐలయ్య, గుంపుల మహేశ్, ఇమ్రాన్, రియాజ్, బావు సతీశ్, అన్వర్, ప్రభాకర్, శివప్రసాద్, వంశీ పాల్గొన్నారు.
6వ వార్డులో..
రామవరం, మార్చి 9 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 6వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, మాధవి ఇందిరా, నవ్య, శిరీష, వాసుకి, సాహిని, సత్యవేణి, శ్రీనిజ, రాజకుమారి, రాధిక, సౌజన్య, శ్రీవాణి, భవాని, సృజన, అలేఖ్య, నవ్యశ్రీ, మౌనిక, కల్యాణి, షాహిన్, గౌస్, సూరిబాబు పాల్గొన్నారు.