
రఘునాథపాలెం, నవంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ముదిరాజ్‌లకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఖమ్మంలోని చెరుకూరి వారి తోటలో ముదిరాజ్‌ల వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ముదిరాజ్ యువ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు దోరేపల్లి శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కార్తీకమాసంలో ఏర్పాటు చేసుకునే వన మహోత్సవాన్ని తొలిసారిగా ముదిరాజ్‌లు జరుపుకోవడం, ముఖ్యఅతిథిగా తాను హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో నిర్మించనున్న బీసీ భవన్ వేదికగా బీసీ కులాలు ఐక్యమై రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్‌లకు అవకాశం దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. 1986లో ముదిరాజ్‌ల ఐక్యవేదిక ఫౌండేషన్‌కు కృషిచేసిన ముఖ్యనేతలను శాలువాతో సన్మానించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ముదిరాజ్‌లకు సముచిత స్థానం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ ముదిరాజ్‌ల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముదిరాజ్‌లు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రతి ఏటా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వన మహోత్సంలో ముదిరాజ్ సంఘం జిల్లా నేతలు మామిడి వెంకటేశ్వర్లు, మేడారపు వెంకటేశ్వర్లు, పిట్టల వెంకటనర్సయ్య, కాశబోయిన అనంతరాములు, పతానపు వెంకటేశ్వర్లు, పిట్టల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, గౌరవాధ్యక్షుడు కొప్పెర జానకిరాములు, మామిళ్ల కోటేశ్వరరావు, డాక్టర్ కిశోర్‌బాబు, కొప్పెర సరిత ఉపేందర్, తురక మహేశ్, యుత్ బాధ్యులు పీక విద్యాసాగర్, భద్రం, కాశబోయిన ఉపేందర్, సాంబ, కృష్ణ, కుడిత సురేశ్, పోతనబోయిన ఉపేందర్, యరకల నాగరాజు, పిట్టల శ్రీకాంత్, మురళి, ఎన్నబోయిన సాయి, లేళ్ల మహేశ్, బోయిన సురేశ్, తేనె వంశీ, డేగల ఉపేందర్, శీలం శ్రీను పాల్గొన్నారు.