Danam Nagender | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒప్పుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని తెలిపారు.
నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని దానం నాగేందర్ అన్నారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం కలిపి మొత్తం 300 డివిజన్లలో గెలుస్తాయని పేర్కొన్నారు. గ్రేటఱ్ హైదరాబాద్ అంతా ప్రచారం చేస్తానని.. కాంగ్రెస్ పథకాలను వివరిస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దిశగా గులాబీ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రస్‌లో ఉన్నానని ఒప్పుకున్నారు. హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే దానం నాగేందర్ ఈ ప్రకటన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.