Keerthy Suresh |కొన్నిసార్లు విజయం కూడా ఓ సవాలుగా మారుతుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జీవితంలో ఇదే నిజమైంది. మహానటి చిత్రంతో నేషనల్ లెవెల్ గుర్తింపు అందుకున్న కీర్తికి ఆ తరువాత మాత్రం సరైన హిట్లు దక్కలేదు. ఆ పాత్రతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నా, దాని ప్రభావమే ఆమె తరువాతి ప్రాజెక్టుల్లో తలెత్తింది. మహానటి తరవాత ఆమె ఏ పాత్రలో కనిపించినా, ప్రేక్షకులు ఫుల్ కన్విన్స్ కాలేకపోయారు. తెలుగులో నేను శైలజ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి, పవన్ కల్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ బాబు తో సర్కారు వారి పాట, నానితో దసరా వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల్లో దసరా మాత్రమే బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, చిరంజీవితో చేసిన భోళా శంకర్ చిత్రం ఫ్లాప్ అయింది.
ఈ మధ్య కీర్తి తెలుగులో కొంత గ్యాప్ తీసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ఆమె… తెలుగులో మాత్రం ఒక్క సినిమా అవకాశమూ దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ఏంటంటే.. కీర్తి సురేష్ ఎట్టకేలకు మళ్లీ ఒక తెలుగు మాస్ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకులని పలకరించబోతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండగా, ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపికయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
హీరోయిన్ ఎంపిక విషయంలో మొదట రష్మిక మందన్న పేరు పరిశీలించినప్పటికీ, ఎందుకో ఆ కాంబినేషన్ ఫైనల్ కాలేదు. ఆ తర్వాత అనేక పేర్లు పరిశీలించిన తరువాత చివరికి అవకాశం కీర్తి సురేష్ కు దక్కింది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకుల్లో కీర్తికి ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆమె మళ్లీ స్క్రీన్ పై కనిపించనుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మాస్ మసాలా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, కీర్తి తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ తన హవా చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.