AA22xA6 | పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ముంబైలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బన్నీ టీం కొత్త లొకేషన్ల వేటలో భాగంగా అబుదాబికి పయనమైనట్టు వార్తలు కూడా వచ్చాయి.
పాపులర్ ప్రొ డ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. మిత్రమండలి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ.. మూవీ రిలీజ్ ఎప్పుడనేది పొంగళ్ 2026 సమయంలో మేకర్స్ ప్రకటిస్తారని చెప్పాడు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తొలిసారి వస్తున్న సినిమా కావడం.. వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్ అయిన సన్ పిక్చర్స్‌లో మూవీ వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
రీసెంట్గా అల్లు అర్జున్, అట్లీ జపనీస్ బ్రిటీష్ డ్యాన్సర్, కొరియోగ్రఫర్ హొకుటో కొనిషితో దిగిన ఫొటోలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ మరోవైపు ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్