కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ):‘ఇపుడున్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో నాకు తెలిసి ఎలాంటి లోపాలు లేవు. ఒక మతానికి, కులానికి, వర్గానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇలాంటి చిహ్నాన్ని మార్చడం సమంజసంగా లేదు. మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చడం తప్పని నేను భావిస్తున్న. రాష్ట్ర గీతా న్ని తెలంగాణ భావాలకు, సంస్కృతికి సం బంధం లేని వ్యక్తి కీరవాణితో కంపోజ్ చేయించడంపై తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్న’ అని ప్రముఖ కవి, రచయి త వారాల ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం అధికార చిహ్నంలోని కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘అధికారిక చిహ్నంలో మార్పులు చేయడం సరికాదు. తెలంగాణకు, తెలంగాణభావానికి సంబంధం లేని వ్యక్తితో తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయించడం సరైన నిర్ణయం కాదు. ఇప్పటి వరకు ఉన్న చిహ్నంలో ఏవైనా లోపాలు ఉంటే తెలంగాణ సమాజంలో చర్చకు పెట్టాలి. కానీ, మార్చాలని మారుస్తామంటే సరైంది కా దు. ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని మనం గౌరవించాలి. మన జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ఠాగూ ర్ రాశారు. అప్పుడు ఈ గీతంపై అనేక ఆరోపణలు ఉండేవి. అయినా దానిని భారత సమాజం ఆమోదించింది. నెహ్రూ నుంచి మోదీ వరకు ఎవరూ మార్చాలని చూడటం లేదు. ఇప్పుడు అధికారంలో ఉ న్నామని, మార్చాలని మార్చుకుంటే పోతే రేపు మరొకరు అధికారంలోకి వచ్చి వారికి అనుకూలంగా మార్చుకుంటూ పోతే అ ర్థం ఉంటుందా..? మనకు ఎప్పటికైనా శాశ్వత చిహ్నం అనేది ఉండాలి కదా..! కాకతీయ తోరణం మార్చాలనుకుంటున్నారని తెలుస్తున్నది. వాళ్లు మన వాళ్లుకాదా..? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాతీయ గీతాన్ని మారుస్తరా..? ఆలోచించుకోవాలి.. కీరవాణికి రాష్ట్ర గీతానికి బాణీలు కట్టే పని అప్పగించడంలో కూడా నాకు అభ్యంతరం ఉన్నది. ఈ విషయంలో నిర్ణయం ఎవరిదని అడిగితే సీఎం అని అందెశ్రీ, అందెశ్రీదేనని సీఎం చెప్పుకుంటున్నారు. అందెశ్రీ గొప్ప కవి అందులో ఏ సం దేహం లేదు. కానీ, రాష్ట్ర గీతం విషయం లో ఆయనపై జరుగుతున్న చర్చ ఆరోగ్యకరంగా లేదు. అధికారిక చిహ్నంలో ఎ లాంటి లోపాలు ఉన్నాయో చర్చకు పెట్టిన తర్వాతనే మార్పులు చేయాలి. కాకతీయులు మనల్ని పాలించారు. ఇది చారిత్రక సత్యం. ఇపుడున్న చిహ్నం మార్చితే చరిత్రను మార్చలేం కదా..’ అని ఆనంద్ పేర్కొన్నారు.