జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో ( BRS ) చేరుతున్నారు. ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాస్ హనుమంతు నాయుడు ( Hanumanthu Naidu ) ఆధ్వర్యంలో హైదరాబాదులో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు బయలు దేరారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు సుమారు వంద వాహనాల్లో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాస్ హనుమంతునాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ( KCR ) మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో గద్వాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు . ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పారు. ఈ ర్యాలీలో నాయకులు గాజులపాడు రఘు, చక్రి, అంగడి బస్వ రాజ్, శ్రీరాములు, మోనేష్ తదితరులు పాల్గొన్నారు .