మూడు రోజులపాటు రాష్ట్రమంతటా సంబురాలు
సమాయత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా నిర్వహించనున్న కేసీఆర్ మహిళాబంధు కోసం టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించనున్న కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రణాళికలు రూపొందించారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఏడున్నరేండ్లుగా మహిళాభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళల కోసం నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులున్నారో లెక్కలు తీసి వాటి ఆధారంగా మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఆదివారం సంబురాల ప్రారంభం. మొదటిరోజు సీఎం కేసీఆర్ ఫొటోకు రాఖీలు కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మాన కార్యక్రమాలు. అనంతరం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు.
5,445 మందికి ఉపాధి అవకాశాలు
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు సుల్తాన్‌పూర్‌లోని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఇండస్ట్రియల్ పార్కును మహిళా దినోత్సవం రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పార్కును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ నెల 8న ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఫిక్కీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎఫ్ఎల్వో కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కులో మహిళా పారిశ్రామికవేత్తలకు 50% రాయితీతో స్థలాలు కేటాయించారు. స్థలాలను పొందిన 25 కంపెనీల్లో ఇప్పటికే మూడు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి. మిగిలిన కంపెనీలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కొన్ని మహిళా పారిశ్రామికవాడలు ఉన్నప్పటికీ 100 శాతం మహిళలతో చేపట్టిన మొదటి ఇండస్ట్రియల్ పార్కు ఇదేనని అధికారులు పేర్కొన్నారు. కాలుష్యానికి ఏమాత్రం తావులేని ఎలక్ట్రానిక్స్, ఎల్ఈడీ, ప్యాకేజింగ్, ఫర్నిచర్, జనరల్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఆభరణాలు, ఆటోమొబైల్ పరికరాలు, సిమెంట్ కాంక్రీట్ ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు, రెడీమేడ్ దోశలు, ఇడ్లీల పిండి తయారీ తదితర హరితశ్రేణిలోని కంపెనీలే ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు రూ.156.43 కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, 5,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సోమవారం (7వ తేదీన) మహిళా సంక్షేమ కార్యక్రమాలైన కల్యాణలక్ష్మి/షాదీముబారక్, ఇతర లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి కలవడం. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం. మంగళవారం (8వ తేదీన) నియోజకవర్గస్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు. మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కంటి దవాఖానల నెట్వర్క్ ‘డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్’ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ దవాఖానల్లో మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం 9619334129 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.