KCR |మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ 71 వ జన్మదిన పురస్కరించుకొని మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని పునర్ వైభవంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. అధికారం కోల్పోయిన కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు.
పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి కృష్ణారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, విశ్వం, పట్టణ పార్టీ కో కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, జుబేర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజా గౌడ్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం చంద్రకళ, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు చింతల. నర్సింలు, మోచి. కిషన్,సాదిక్, సాయిలు, శ్రీకాంత్, కండెల. సాయిలు, నగేశ్, కిషన్, గట్టేష్, పాపయ్య, కిషన్, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్ , ఫాజిల్,ఇస్మాయిల్,సాప. సాయిలు, మేకల సాయిలు, సాప.శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, మోహన్,శ్రీనివాస్, యాదగిరి, నారాయణ,సురేష్, రంజిత్ నాయక్, లడ్డు నాయక్, అమీర్ చాంద్ పాషా ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.