
హైదరాబాద్, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.12.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కావేరీ సీడ్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.23.40 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 10 శాతం ఎగబాకి రూ.147.56 కోట్లకు చేరుకున్నది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా శనివారం కంపెనీ బోర్డు సమావేశమై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.4 లేదా 200 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది.