కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట తహసీల్దార్‌గా డీ సునీల్ కుమార్ (Tahsildar Sunil Kumar) శనివారం బాధ్యతలు ( Charge ) స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూసరింటెండెంట్గా విధులు నిర్వహించిన సునీల్ కుమార్‌ను కాసిపేట తహసీల్దార్‌గా బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన భోజన్న నిర్మల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు నూతన తహసీల్దార్‌ను కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు గోలేటి స్వామి, మాదాసు దేవేందర్, అక్కెపల్లి రాజేష్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజయ్య, ఆర్ఎ. కమల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.