Ayodhya : అయోధ్యలోని పవిత్ర రామాలయంలో అనుచిత ఘటన జరిగింది. దేవాలయం ప్రాంగణంలో కాశ్మీర్ కు చెందిన ఒక ముస్లిం నమాజుకు ప్రయత్నించాడు. ఈ ఘటను శుక్రవారం జరిగింది. స్థానికులు, మీడియా కథనాల ప్రకారం.. కాశ్మీర్ కు చెందిన అహ్మద్ షేక్ (55) అనే ఒక వ్యక్తి శుక్రవారం అయోధ్యలోని రామాలయం ప్రాంగణంలో, సీతా రసోయి ప్రాంతంలో నమాజు చేసేందుకు ప్రయత్నించాడు.
అంతకుముందు అతడు దేవాలయాన్ని దర్శించుకున్నాడు. అనంతరం నమాజు చేసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అతడు దేవాలయంలోకి ఎలా ప్రవేశించాడు, ఇంత భద్రత ఉన్నప్పటికీ లోపలికి వచ్చి, నమాజు చేసేందుకు ఎలా ప్రయత్నించాడు వంటి వివరాలు ఆరా తీస్తున్నారు. అలాగే అతడి ట్రావెల్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు.. అతడితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా.. వంటి విషయాలపై ప్రశ్నిస్తున్నారు. అతడివద్ద కొన్ని డ్రై ఫ్రూట్స్ ను పోలీసులు గుర్తించారు. అతడు అజ్మీర్ వెళ్తున్నట్లుగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. అయోధ్య రామాలయంలో మకర సంక్రాంతి వేడుకలకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరగడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.