కోదాడ, నవంబర్ 05 : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, రామాలయం, రఘునాథ స్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Kodada : కోదాడలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Kodada : కోదాడలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Kodada : కోదాడలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు