హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక దీపోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయాల్లో అధ్యాత్మికత వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేయాలని సీఈవోలు, అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సామూహిక దీపోత్సవాల్లో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, వత్తులు, పసుపుకుంకుమ ఉచితంగా అందించనున్నామని వెల్లడించారు.