కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి | తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) ఆదివారం తెలిపింది.

న్యూఢిల్లీ : తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) ఆదివారం తెలిపింది. తుఫానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, ఈ నెల 18న ఉదయం గుజరాత్ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం పంజిమ్-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
18న తెల్లవారు జామున పోరుబందర్ మహువా (భావ్నగర్ జిల్లా) వద్ద తీరం దాటుతుందని చెప్పింది. ఓ వైపు కరోనాతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుండగా.. మరో వైపు తౌక్టే తుఫాను ముంచుకువస్తున్నది. మరో వైపు గోవా తీర ప్రాంతాలు, రాజధాని పనాజీని తుఫాను తాకింది. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. తీర ప్రాంతాల్లో తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని సీఎం బీఎస్ యెడ్యూరప్ప పేర్కొన్నారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై బాధిత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

