Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Karimnagar | కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం.. విలీన గ్రామాల ప్రజలకు శాపంలా మారింది. చుట్టూ ఉన్న గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసినప్పుడే ఆయా పంచాయతీలకు చెందిన అన్ని విభాగాల రికార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా.. కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి పట్టించుకోకపోవడం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది.
Karimnagar | కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం.. విలీన గ్రామాల ప్రజలకు శాపంలా మారింది. చుట్టూ ఉన్న గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసినప్పుడే ఆయా పంచాయతీలకు చెందిన అన్ని విభాగాల రికార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా.. కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి పట్టించుకోకపోవడం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు విలీన గ్రామాల ప్రజలు తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం తిప్పలు పడాల్సి వస్తున్నది. ప్రధానంగా ఎంతో ముఖ్యమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నా.. బల్దియా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 23: కరీంనగర్ సమీపంలోని రేకుర్తి, సీతారాం పూర్, ఆరెపల్లి, అలుగునూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, పద్మనగర్, సదాశివపల్లి గ్రామాలు 2018లో నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. 2025లో కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలు కలిశాయి. అయితే విలీన సమయంలో జనన, మరణ ధ్రువీకరణ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకోకపోవడంతో పత్రాలను మంజూరీ చేసే విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. నిజా నికి విలీనం తర్వాత ఆయా జీపీలకు సంబం ధించి అన్ని రికార్డులను నగరపాలక అధికా రులు స్వాధీనం చేసుకోవాలి. కానీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోలేదని తెలుస్తు న్నది. ఇవి ఆయా తహసీల్ ఆఫీసుల్లోనే ఉన్నట్టు సమాచారం. గతంలో మున్సిపాలి టీగా ఉన్న కొత్తపల్లితోపాటు బొమ్మకల్ పంచాయతీ రికార్డులు మాత్రమే నగరపాలక సంస్థలో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతు న్నాయి. అయితే ఈ రికార్డులను ఆన్లైన్ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. బర్త్, డెత్ సర్టిఫి కెట్లు కావాలంటే సవాలక్ష నిబంధనలతో ప్రజ లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఎంతో కీలకమైన ఈ పత్రాల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
ఆర్ డీవో ప్రాసెస్ నిలిపివేత
మున్సిపల్ పరిధిలో జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోతే ఇంతకుముందు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీవో) నుంచి పొందే అవకాశం ఉండేది. ప్రజలు దరఖాస్తు చేసుకుంటే రికార్డులను పరిశీలించి, వివరాలు లేకపోతే ‘నో రికార్డు’ పేరిట వివరాలను దర ఖాస్తుదారులకు ఇచ్చేవారు. దీనికి అనుగు ణంగా రెవెన్యూ విభాగం నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకుంటే.. ఆర్డీవో ఈ పత్రాలకు మంజూరు ఆదేశం ఇచ్చేవారు. వీటిని తీసుకొని మళ్లీ మున్సిపాలి టీలో దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి ధ్రువీకరణ పత్రాలు వచ్చేవి.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త గెజిట్ ను తెచ్చింది. ఇది అక్టోబర్ ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నుంచి మొదటి ఏడాది లోగా ఆయా మున్సిపాలిటీ పరిధిలో వివరా లను నమోదు చేసుకొని ధ్రువీకరణ పత్రా లను పొందవచ్చు. ఏడాది గడిచిన తర్వాత రెండో ఏడాది వరకు దరఖాస్తు చేస్తే రెవెన్యూ విభాగంలోని ఆర్డీవో నుంచి ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. అంతకు మించితే కోర్టు ద్వారానే పత్రాలు తీసుకోవాలని గెజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానం అమలులోకి రావడంతో విలీన గ్రామాల ప్రజలు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో పంచాయతీల్లో నమోదైనా ఇప్పుడు నగరపా లక సంస్థ నుంచి రికార్డులు లేవని చెబుతుం డడంతో ఈ పత్రాలు అవసరమైన ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనిని ఆసరా చేసు కొని బల్దియాలోని కొందరు సిబ్బంది పత్రాలు ఇప్పిస్తామంటూ అక్రమ పద్ధతిలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు న్నారు. ఇప్పటికైనా నగరపాలక ఉన్నతాధికా రులు దృష్టి సారించాలని, ఆయా మండల కార్యాలయాల నుంచి రికార్డులు తీసుకొని నగరపాలక సంస్థలో ఆన్లైన్ చేయించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

