చిగురుమామిడి, మార్చి 13: సీఎం కేసీఆర్ నేతృత్వంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రకు విశేష స్పందన లభించింది. ఆదివారం మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబ్ పేట, కొండాపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాయకులు ర్యాలీ తీయగా, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇందుర్తిలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించగా, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జకుల రవి తదితరులు పాల్గొన్నారు. గాగిరెడ్డిపల్లిలో వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, కొండాపూర్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, నవాబ్ పేటలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రూ.39 కోట్లతో ఇందుర్తి నుంచి ఆరేపల్లి హుస్నాబాద్ వరకు డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నేతృత్వంలో అభివృద్ధి వేగవంతమైందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో హుస్నాబాద్ మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ కొమ్మెర మంజుల, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ అందే సుజాత, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, సుద్దాల ప్రవీణ్, సన్నీళ్ల వెంకటేశం, పెద్దపల్లి భవాని, చెప్యాల మమత, బోయిని శ్రీనివాస్, పిట్టల రజిత, ముప్పిడి వెంకట నర్సింహారెడ్డి, పీచు లీల, కానుగంటి భూంరెడ్డి, ఎంపీటీసీలు పెసరి జమున, మెడబోయిన తిరుపతి, కొత్తూరి సంధ్య, మంకు స్వప్న, మండల నాయకులు పెసరి రాజేశం, సర్వర్ పాషా, చెప్యాల శ్రీనివాస్, కల్వల రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచులు తోట సతీశ్, కిషన్ రెడ్డి, అన్నాడి మల్లికార్జున రెడ్డి, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు పెద్దపల్లి అరుణ్ కుమార్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు బోయిని మనోజ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ కటుకోజ్వల రజినీకాంత్, అనుమాండ్ల సత్యనారాయణ, టీఆర్ఎస్ అన్ని గ్రామాల అధ్యక్షులు ఎసే సిరాజ్, కల్వల సంపత్ రెడ్డి, బుర్ర తిరుపతి, పిల్లి వేణు, గిట్ల తిరుపతిరెడ్డి, తోడేటి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, బోయిని రమేశ్, శ్యామకూర సంపత్ రెడ్డి, మహంకాళి కొమురయ్య, ముసు కిష్టారెడ్డి, సిద్దెంకి రాజమల్లు, కంప అశోక్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘ఎంపీగా సంజయ్ చేసిందేమీ లేదు’
చిగురుమామిడి, మార్చి 13: ‘ఎంపీగా బండి సంజయ్ గెలిచి మండలానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కట్టమీద తట్టెడు మట్టి పోయేలే.. అలాంటివారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం’ అంటూ ప్రజాచైతన్య యాత్రలో గాగిరెడ్డిపల్లెకి చెందిన పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రలో పాల్గొన్న వారు సీఎం కేసీఆర్ కృషి వల్లే గ్రామాలు అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. ప్రతి పల్లెకు మౌలిక వసతులు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇక్కడ మహిళా నాయకులు సువర్ణ, కవిత, తార, రజిత, స్వప్న, పద్మ , మావురమ్మ, రజిత, మంగ, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.