కమాన్‌చౌరస్తా, మార్చి 13: తెలంగాణ సంస్కృతిని పరిరక్షించి గుర్తింపు తీసుకువచ్చిన ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత అని మేయర్ వై సునీల్ రావు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేయర్ వై సునీల్ రావు హాజరై, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత యువతకు సిల్ డెవలప్మెంట్ లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షిస్తూ, జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు బానోత్ కిషన్ నాయక్, జాగృతి జిల్లా కోశాధికారి అత్తె రాజారాం, పీఆర్వో గాలిపెల్లి రత్నాకరచారి, యూత్ జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ రజీ, ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మ్యాకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా కో-కన్వీనర్లు కలకుంట్ల జలజ, పిన్నింటి సంగీతారెడ్డి, ఇనుగంటి స్వాతి, నియోజకవర్గ కన్వీనర్లు అనువోజ్ రవికాంత్, గుండేటి తిరుపతి, పోలు రాము, విద్యార్థి విభాగం జిల్లా కో-కన్వీనర్లు సత్తు సంతోష్, యూత్ జిల్లా కో-కన్వీనర్ మద్దుల రాజకుమార్, పుసాల పవన్, పోలుదాసరి శరత్, నాయకులు పెంచికల మల్లేశ్, పడిదం చంద్రమౌళి, గోవులకొండ శ్రీనివాస్, వెలిచాల శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, పెద్దపల్లి మధుసూదన్, ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో
కార్పొరేషన్, మార్చి 13:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్ని, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సాయిరాం ఉప్పు, రాజేశ్ రాపోలు, ప్రవీణ్‌రెడ్డి, రవి, శ్రీకాంత్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మెల్బోర్న్లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఆవిర్భవించిన తమ శాఖ తక్కువ సమయంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేడుకల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు సునీల్‌రెడ్డి, ప్రవీణ్ లేదెళ్ల, సతీశ్‌కుమార్, సంతు, సునీల్, చైతన్య, వెంకట్, ప్రసాద్, క్రాంతి పాల్గొన్నారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ, మార్చి 13: తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ముకరంపుర సరిల్లో అనాథ వృద్ధులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకుడు సత్తు సంతోష్, జిల్లా యువత కో-కన్వీనర్ మద్దుల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సంకల్పంతోనే హరితరాష్ట్రం
చొప్పదండి, మార్చి 13: ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ హరిత రాష్ట్రంగా మారుతున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని నిరాశ్రయుల ఆశ్రమం ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కలను సంరక్షిస్తుండడంతోనే రాష్ట్రం హరితమయంగా మారుతున్నదని అన్నారు.
పట్టణంలో రామకృష్ణ సేవాసమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, పెరుమండ్ల గంగయ్య, రామకృష్ణ సేవాసమితి సభ్యులు చెట్లరాంకిషన్, కనకయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.