జమ్మికుంట రూరల్, మార్చి 10: తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మెదలయిందని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు పర్లపల్లి నాగరాజు పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 11103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. మాచనపల్లి గ్రామంలో నాగరాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు.
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన నరేంద్రమోదీ ఏడు సంవత్సరాల్లో కనీసం 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పొల్సాని రాజేశ్వర్రావు, మాజీ సర్పంచ్ కనువెల్ల రాజమల్లు , ఉప సర్పంచ్ వేల్పుల శ్రీకాంత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొజ్జం తిరుపతిరెడ్డి, ఆర్బీసీ సభ్యులు వేల్పుల బొంద్యాలు, ఇరవేన మహేశ్, గోపాల్, రమేశ్, సతీశ్, విజయ్, చందు, సుమన్, కళ్యాణ్ , సంపత్, అభి, రాజు, సిద్ధు తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పాలాభిషేకం
వీణవంక, మార్చి 10: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరామ్, నాయకులు ఆవుల తిరుపతి, అప్పని హరీశ్వర్మ, చిన్నాల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా 80 వేల పైచిలుకు ఉద్యోగాల ప్రకటన చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బీజేపీకి దమ్ముంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు భర్తీచేయని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకులు చరణ్, అఖిల్, రాజు, క్రాంతి, ప్రవీణ్, అరవింద్ పాల్గొన్నారు.