కొత్తపల్లి, మార్చి 10: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 90వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించి, రికార్డు సృష్టించారని కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్నారు. ఉద్యోగ నియామక ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కొత్తపల్లి పట్టణంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేపట్టే నియామకాలతో స్థానికులకే 90 శాతం ఉద్యోగాలు వస్తాయని, ఇది సీఎం కేసీఆర్ సాధించిన గొప్ప విజయమన్నారు.
నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని పిలుపు నిచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ-రమేశ్, ఎస్కే నాజియ బాబా, స్వర్గం వజ్రాదేవి-నర్సయ్య, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవిత, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఫక్రొద్దీన్, కట్ల మమత, శెట్టిపల్లి ప్రభాకర్, రైతు సంఘం అధ్యక్షుడు కలకొండ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, మార్చి 10: ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు నరేశ్రావన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేశ్ రావన్ మాట్లాడుతూ, భారీగా ఉద్యోగ నియామకాలు ప్రకటించిన సీఎం కేసీఆర్కు యువత తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చింటు, హరీశ్, శ్రీను, శ్రీకాంత్, అఖిల్, సంజయ్, నవీన్, సతీశ్, రిషి తదితరులు పాల్గొన్నారు.