Sai Pallavi | టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న భారీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్రయూనిట్. జపాన్ లోని మంచు కురిసే అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, సాయి పల్లవి మరియు జునైద్ ఖాన్ల మధ్య కెమిస్ట్రీ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
విశేషమేమిటంటే, దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమీర్ ఖాన్ మరియు మన్సూర్ ఖాన్ ఈ చిత్రం కోసం చేతులు కలపడం విశేషం. ఇద్దరు అపరిచితుల మధ్య ఒక రోజులో కలిగే భావోద్వేగపూరితమైన మార్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇర్షాద్ కామిల్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. మనోజ్ లోబో సినిమాటోగ్రఫీ, బల్లు సలూజా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పటికే రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’లో సీతగా నటిస్తున్నప్పటికీ, అంతకంటే ముందే ‘ఏక్ దిన్’ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
In the chaos of life, love will find you… Ek Din❤️#SaiPallavi #JunaidKhan
Directed by: Sunil Pandey
Written by: Sneha Desai, Spandan Mishra
Produced by: Mansoor Khan, Aamir Khan, Aparna Purohit
Music: Ram Sampath
Lyrics: Irshad Kamil
Co-Producer: B. Srinivas Rao
Associate… pic.twitter.com/xNCfzYbHF4— Aamir Khan Productions (@AKPPL_Official) January 15, 2026