రామడుగు, మార్చి10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో వెలిచాల పాలకవర్గం, ప్రజలు ముందువరుసలో ఉ న్నారని ట్రైనీ సివిల్ సర్వెంట్లు ప్రశంసించారు. గ్రామీణుల జీవనవిధానం, సంస్కృతీససాంప్రదాయాలను తెలుసుకొనేందుకు శిక్షణలో భాగంగా మండలంలోని ఈ నెల 7న వెలిచాలను సందర్శించారు. చివరిరోజైన గురువారం స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న వ నరులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు పు ష్క లంగా నీరందుతున్నదని రైతులు వారితో చెప్పా రు. పథకాల వినియోగంలో సర్పంచ్ వీర్ల సరో జన చూపిన చొరవను అభినందించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ట్రైనీ సివిల్ సర్వెంట్లకు జ్ఞాపికలు అందించి, శాలువాలతో సత్కరించి సాదరంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ట్రైనీ సివిల్ సర్వెంట్లు ఐపీఎస్ హిమాన్షు వర్మ(ఉత్తరాఖండ్), ఐఎఫ్ఎస్ క్షితిజ సక్సేనా(సిక్కిం), ఐసీఏస్ విక్రాంత్ సింగ్(ఢిల్లీ), ఐడీఎస్ఈ నా గేంద్ర బాలాజీ(మహారాష్ట్ర), ఎంపీడీవో ఎన్నార్ మలోహత్రా, ఎంపీవో సతీశ్రావు. ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, వార్డు సభ్యులు బండపెల్లి శ్రీకృష్ణ, వంగ రమణ తదితరులు ఉన్నారు. అలా గే స్థానిక సరస్వతి హైస్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచిం చారు. చిన్ననాడే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధన కు నిరంతరం శ్రమించాలని అభిలషించారు.
చేనేత హ్యాండ్లూమ్ మగ్గాల పరిశీలన
కరీంనగర్ రూరల్:మార్చి 10: మండలంలోని చామనపలిల్లో చేనేత హ్యాండ్లూమ్ మగ్గాలను ట్రైనీ సివిల్ సర్వెట్లు పరిశీలించారు. గురువారం చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామాన్ని సందర్శించిన సివిల్ సర్వీసెస్ ట్రైనీలు, అధికారులతో కలసి, చామనపల్లికి వచ్చారు. చేనేత హ్యాండ్లూమ్స్ ద్వారా బట్టల తయారీని పరిశీలించారు. ఇక్కడ ట్రైనీలు సాయిపల్లవి, చారువర్మ, అర్పిత్ గుప్తా, వెంకటేశ్, ప్రభు అయ్యాన్షా ఉన్నారు. గ్రామం లో ఎన్ని మగ్గాలు పనిచేస్తున్నాయని, పవర్ లూం, హ్యండ్లూమ్ ద్వారా దుస్తుల తయారీ , వ్యాపార లావాదేవీలు, మార్కెటింగ్ పద్ధ్దతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చోప్పదండి ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్రెడ్డి పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ ఉన్నారు.