మానకొండూర్, మార్చి 9: భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వయోపరిమితి పెంపుపై సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. టీఆర్ఎస్ శ్రేణులు, యువత, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. మానకొండూర్ పల్లెమీద చౌరస్తావద్ద సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచారు. జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉప సర్పంచ్ నెల్లి మురళి, టీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, టీఆర్ఎస్వై మండల ప్రధాన కార్యదర్శి దండు మనోజ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, నాయకులు రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, గోపు ఈశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, ఆరెపల్లి కిరణ్ ఉన్నారు. జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు మానకొండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రమేశ్‌బాబు, సభ్యులు లలిత, సుధారాణి, మంజుల, ప్రగతి, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
గంగిపల్లిలో..
మానకొండూర్ రూరల్, మార్చి 9: గంగిపల్లిలో మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. జొన్న రమేశ్, మూల కరుణాకర్‌గౌడ్, ఆకుల శ్రీనివాస్, కాట నర్సయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బాష రాజు, రాజు, నూనె హరీశ్, ముల్కల బాబూరావు ఉన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, మార్చి 9: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఉద్యోగాల ప్రకటనతో ప్రభుత్వంపై యువతకు నమ్మకం పెరిగిందని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, సర్పంచులు జకుల రవి, బెజ్జంకి లక్ష్మణ్, సన్నీళ్ల వెంకటేశం, సుద్దాల ప్రవీణ్, మండల నాయకులు రామోజు కృష్ణమాచారి, మంకు శ్రీనివాస్‌రెడ్డి, సర్వర్ పాషా, పెనుకుల తిరుపతి, బిల్ల వెంకటరెడ్డి, బోయిని మనోజ్, ఒంటెల కిషన్‌రెడ్డి, ఎస్కే సిరాజ్, మక్బుల్పాషా, తోట సతీశ్, కల్వల సంపత్‌రెడ్డి, చింతపూల అంజయ్య పాల్గొన్నారు.
దేశానికి కేసీఆర్ రోల్ మోడల్
గన్నేరువరం, మార్చి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి రోల్ మోడల్ అని, జంబో నోటిఫికేషన్‌తో నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారని టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేశ్ పేర్కొన్నారు. గన్నేరువరంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరుగు రాము, జాలి తిరుపతిరెడ్డి, టేకు అనిల్, పత్తి అంజి, సాయి పటేల్, పాలెపు అజయ్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, మార్చి9: తిమ్మాపూర్ స్టేజీపై టీఆర్ఎస్వై నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయిని వెంకట్‌రెడ్డి, కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, దుండ్ర రాజయ్య, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాదన రాజేందర్‌రెడ్డి, అనిల్ పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, మార్చి 9: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ చిత్ర పటాలకు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచులు దాసారపు భద్రయ్య, కోండ్ర రాజయ్య, విండో చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, చెరుకు వెంకటేశం, పంజాల రాజయ్య, బొజ్జ రవి, బొజ్జ సుధాకర్, తిరుపతి, కోటి, రామకృష్ణ పాల్గొన్నారు.