చొప్పదండి, మార్చి 9: సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడం హర్షణీయమని జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వీక్షించేందుకు జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సీఎం 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తున్నట్లు ప్రకటించగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు ఎల్ఈడీలో కేసీఆర్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి, సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాగా, కేసీఆర్ ప్రసంగాన్ని యువకులు ఇండ్లల్లో టీవీల ముందు, పలు దుకాణాల యజమానులు సెల్ఫోన్లలో తిలకించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచులు గుంట రవి, వెల్మ నాగిరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, నాయకులు నలుమాచు రామకృష్ణ, బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గొల్లపల్లి శ్రావణ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, మావురం మహేశ్, మహేశుని మల్లేశం, బీసవేని రాజశేఖర్, చోటు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 9: మండలంలోని మధురానగర్‌లో టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు సీఎం కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతం ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారన్నారు. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్, సర్పంచ్ మాల చ్రందయ్య, నాయకులు వేముల అంజి, ముద్దం నగేశ్, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, పంజాల ఆంజనేయులు, కోల లింగారెడ్డి, దోమకొండ మల్లయ్య, సామంతుల శ్రీనివాస్, మామిడిపెల్లి అఖిల్, ఉప్పు ప్రశాంత్, తాళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.