జగిత్యాల రూరల్, మార్చి 8 : ఆడపిల్లలను సమానంగా చూ డాలని, ఈ మార్పు ఇంటి నుంచే మొదలు కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ జీ రవి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి కొప్పుల హాజరయ్యారు. ఈ సంద ర్భంగా జిల్లాలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నదని వివరించారు. కుటీర పరిశ్రమల స్థాపనకు బ్యాంక్ లింకేజీ ద్వారా స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తామని, మండలాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా చిన్న పరిశ్రమల స్థాపనకు మహిళా సంఘాలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. కుట్టుమిషన్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 10 లక్షల మంది పెళ్లిళ్లకు ప్రభుత్వం దాదాపు రూ.9 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వం వీ-హబ్ ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, మహిళా శక్తి గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ మహిళలకు అమలు చేస్తున్న పథకాలేనని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, 11లక్షల మందికి కేసీఆర్ కిట్ పథకం అమలు చేశారని తెలిపా రు. పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ, సమాజంలో ఆడపిల్లలను మగపిల్లలతో పాటు సమానంగా చూడాలని పేర్కొన్నారు. ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన సమయంలో తాను సర్వీస్‌లో జాయిన్ అయ్యానని, అప్పుడు చాలా తకువ సంఖ్యలో మహిళా పోలీసులు ఉండేవారన్నారు.
సీఎం కేసీఆర్ మహిళా పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ సమయంలో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ఐల సంఖ్య పెరిగిందన్నారు. అనంతరం పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి గెలుపొందిన విద్యార్థులు, ఉద్యోగినులు, మహిళలకు బహుమతులు, సర్టిఫికెట్లు, చెకులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేసి సన్మానించారు. అనంతరం పారి శుధ్య కార్మికులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రె డ్డి, అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వినో ద్ కుమార్, ఆర్డీవో మాధురి, డీడబ్ల్యూవో నరేశ్, డీఆర్డీవో వినో ద్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సిబ్బంది, మహిళా ఉద్యోగులు, అధికారులు, ఆర్పీ లు, అంగన్వాడీటీచర్లు, ఆయాలు,ఏఎన్ఎంలు