గంగాధర, అక్టోబర్ 29: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో మండలంలోని కోట్లనర్సింహులపల్లి, బూరుగుపల్లి, లక్ష్మీదేవిపల్లి, గంగాధర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేసి, మాట్లాడారు. అనంతరం నారాయణపూర్ గ్రామానికి వెళ్లే దారిలో వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నందున వాహనాలు వెళ్లడానికి అనువుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమాల్లో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, తోట కవిత, వేముల దామోదర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, తోట మల్లారెడ్డి, వేముల అంజి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, పెంచాల చందు, సుంకె అనిల్, మ్యాక వినోద్, గంగాధన వేణు, గంగాధర నగేశ్, గంగాధర శ్రీకాంత్ పాల్గొన్నారు.