గురుపౌర్ణమి పర్వదినాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామకృష్ణ భజన మండలి హుజూరాబాద్, శ్రీ రామానంద భజన మండలి కొత్తపల్లి, శ్రీ భవానీ శంకర్ భజన మండలి, శ్రీ రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం షిర్డీ సాయిబాబా రథయాత్ర వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. కార్యక్రమంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
మున్సిపల్ పరిధిలో గురుపౌర్ణమి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచి శ్రీసత్యసాయి, గీతా మందిర్, హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీలక్ష్మీ గణపతి షిర్డీ సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయిబాబా ఆలయంలో సముద్రాల ప్రసాదాచార్యులు, కిశోరాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చొప్పదండిలో..
మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాయిబాబాకు ఆలయ నిర్వాహకులు, భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో ఆలయ చైర్మన్ గుర్రం హన్మంత రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, నిర్వాహకులు దండె లింగన్న, దూస రాము, శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మణ్, అర్చకుడు శ్యాం తదితరులు పాల్గొన్నారు.
వెన్కేపల్లిలో..
మండలంలోని వెన్కేపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండ గణేశ్, తహసీల్దార్ గడ్డం సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, ఆలయ వ్యవస్థాపకుడు కొత్త వైకుంఠ రెడ్డి, భక్తులు కొత్త మహేందర్ రెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, కొత్త సూర్యప్రకాశ్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి, బైరి రమణారెడ్డి, గడ్డం రమేశ్, ఆలేటి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.