అనతి కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మీడియాలో వస్తున్న కథనాలను వింటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ అభివృద్ధిని కనులారా చూశా. అగ్రిటెక్ మేళాను సందర్శించి ఆధునిక పరికరాల పనితీరు గురించి తెలుసుకొన్నా. ఎలక్ట్రిక్ సైకిల్‌ను బుక్ చేసుకొన్నా. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు చాలా బాగున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు ఎంతో ఉపకరిస్తున్నాయి.
– ముకుందన్, తమిళనాడు యువ రైతు