Kangana Ranaut | నిత్యం అధికారిక కార్యక్రమాలు, పార్లమెంట్ సమావేశాలతో బిజీబిజీగా ఉండే ఎంపీలు కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. తోటి ఎంపీ కుమార్తె పెళ్లి వేడుకల కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఎంపీ నవీన్ జిందాల్ (Naveen Jindal) కుమార్తె వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ నేతలకు ఆహ్వానం అందింది. ఇక పెళ్లి వేడుకల కోసం కొందరు ఎంపీలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. నవీన్ జిందాల్‌తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నటి, హిమాచల్ రాష్ట్రం మండి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోను కంగన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు చేశారు. ‘తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి సినిమా క్షణాలు.. జిందాల్ జీ కుమార్తె వివాహ సంగీత్ కోసం రిహార్సల్స్’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. పార్లమెంట్లో ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఎంపీలు ఒకేచోట చేరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Also Read..
IndiGo | సిబ్బంది కొరతతో విమాన ప్రయాణాల్లో జాప్యం.. ఇండిగోకు డీజీసీఏ సమన్లు
IndiGo | సంక్షోభంలో ఇండిగో.. విమానాల రద్దు వేళ భారీగా పతనమైన షేర్లు
రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ.. భారంగా మారిన విదేశాల్లో ఉన్నత విద్య