కీవ్: రష్యాలోని డ్రోన్ తయారీ కేంద్రంపై ఉక్రెయిన్(Ukrainian Air Force) బాంబు దాడి చేసింది. వోవ్‌చాన్స్క్ లో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ హబ్‌ను పేల్చివేసింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-27 ఫైటర్ జెట్.. సుమారు 226 కిలోల బాంబును జారవిడిచింది. ఆ దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. డ్రోన్ సెంటర్లో ఉన్న ఓ బిల్డింగ్‌పై సుఖోయ్ యుద్ధ విమానం బాంబును వేసింది. టార్గెట్‌ను చేరుకోగానే.. చాలా శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది.
అటాక్ కోసం జీబీయూ-62 బాంబును వాడారు. జేడీఏఎం-ఈఆర్ కిట్‌ను కూడా ఆ అటాక్ కోసం వినియోగించారు. జీబీయూ-62 సుమారు 500 పౌండ్ల బరువున్న బాంబు. ఎంకే-82 ప్రమాణాల ప్రకారం దాన్ని నిర్మించారు. జేడీఏఎం జీపీఎస్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా దీన్ని అప్‌గ్రేడ్ చేశారు. శాటిలైట్, ఇంటర్నల్ నావిగేషన్ ద్వారా ఈ బాంబు టార్గెట్‌ను చేరుకుంటుంది. ఈఆర్ గ్లైడ్ మాడ్యూల్.. ఆ బాంబును టార్గెట్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే యుద్ధ విమానం టార్గెట్ సమీపం వరకు వెళ్లవలసిన అవసరం లేకుండానే బాంబును పేల్చవచ్చు.
Kharkiv Oblast, a Ukrainian Air Force Su-27 drops a 500 lb JDAM-ER glide bomb onto a Russian drone team occupying the upper levels of a grain elevator. pic.twitter.com/yY02DzEoPv
— OSINTtechnical (@Osinttechnical) December 3, 2025