హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) నటించిన సంచలన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission: Impossible – The Final Reckoning) ఎట్టకేలకు ఓటీటీలోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రెంటల్ (అద్దె) విధానంలో ఉన్న ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్స్క్రైబర్లందరికీ ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీలో 8వ సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ (Christopher McQuarrie) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి చిత్రమని చిత్రబృందం వెల్లడించింది.