IndiGo | సిబ్బంది కొరతతో విమాన ప్రయాణాల్లో జాప్యం.. ఇండిగోకు డీజీసీఏ సమన్లు
IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సంక్షోభంలో చిక్కుకుంది. విమాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే.
IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సంక్షోభంలో చిక్కుకుంది. విమాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టుల్లో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు (IndiGo Flights) నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఇండిగో అధికారులకు సమన్లు జారీ చేసింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో కార్యాచరణ సమస్యలపై దర్యాప్తు చేసేందుకు సమన్లు ఇచ్చింది.
కాగా, గత రెండు రోజుల వ్యవధిలోనే 250 నుంచి 300 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 30 విమానాలు రద్దయ్యాయి. ఇక కోల్‌కతాలో నాలుగు విమానాలను సంస్థ రద్దు చేయగా.. సుమారు 24 విమాన రాకపోకలు ఆలస్యం అయ్యాయి. వీటిలో రెండు అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. బుధవారం దాదాపు 100కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలో 38, బెంగళూరులో 42, ముంబైలో 33, హైదరాబాద్‌లో 19 విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా గత నెల అంటే నవంబర్‌లో ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇండిగో ప్రతిరోజూ 2200 విమానాలను నడుపుతున్నది.
Also Read..
IndiGo | సంక్షోభంలో ఇండిగో.. విమానాల రద్దు వేళ భారీగా పతనమైన షేర్లు
IndiGo | సిబ్బంది కొరతతో ఇండిగో సతమతం.. రెండు రోజుల్లో 300 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
Flights Cancelled | కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్‌కు రావాల్సిన 35 విమానాలు క్యాన్సల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

