IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సంక్షోభంలో చిక్కుకుంది. విమాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టుల్లో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా 250 నుంచి 300 విమానాలను సంస్థ రద్దు చేసింది. నవంబర్‌లో ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించింది. ఈ సమస్యల వేళ ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయి.
ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (InterGlobe Aviation) షేర్ ధర వరుసగా రెండో రోజు భారీగా పతనమైంది. విమానాల రద్దు వివాదం నేపథ్యంలో నేడు ఎన్ఎస్ఈ (NSE)లో ఇండిగో షేర్లు దాదాపు 3 శాతానికి పైగా పడిపోయాయి. ఇవాళ ఉదయం ఒక్కో స్టాక్ రూ.5,405కి పడిపోయింది. గత ఐదు రోజుల్లో ఇండిగో స్టాక్ వ్యాల్యూ దాదాపు 6 శాతం పతనమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read..
IndiGo | సిబ్బంది కొరతతో ఇండిగో సతమతం.. రెండు రోజుల్లో 300 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
గగనయానం గందరగోళం.. ఎయిర్‌పోర్టుల్లో పనిచేయని చెక్-ఇన్ వ్యవస్థ.. వందలాది విమానాలు రద్దు
Flights Cancelled | కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్‌కు రావాల్సిన 35 విమానాలు క్యాన్సల్