ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభించిన అతడు.. కివీస్ తరఫున 93 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 2,575 రన్స్ చేశాడు.
బ్యాటర్‌గానే గాక 75 మ్యాచ్‌ల్లో కివీస్‌కు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా ఆ జట్టును 2016, 2022లో సెమీస్‌కు చేర్చిన కేన్ మామ.. 2021లో ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.