హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎయిర్పోర్టుకు సీఎం రేవంత్రెడ్డి మనవడి పేరు ఎలా పెడుతారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాశ్రయానికి పేర్లు సూచించాలని ప్రజాభిప్రాయం కోరిన సీఎం.. ఇప్పటికిప్పుడు తన మనవడి పేరు ‘రుద్రాదేవ్’కు దగ్గరగా ఉండే రేచర్ల రుద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
తన సామాజికవర్గ సేనాధిపతి రేచర్ల రుద్రారెడ్డిపై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయాన్ని ప్రస్తావించారు. కాకతీయ రాజులపై రేవంత్రెడ్డి తన అక్కసును గతంలో చాలాసార్లు మీడియా ద్వారా బహిరంగంగా వెళ్లగక్కారని.. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నంలో ‘కాకతీయ తోరణం’ తీసేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.