హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మయన్మార్ తీరప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం, వచ్చే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కొనసాగుతూ క్రమంగా బలహీనపడుతుందని, 24 గంటల్లో ఆగ్నేయ బంగ్లాదేశ్, మయన్మార్ సమీప ప్రాంతాలవైపు కదులుతుందని, మిజోరం, త్రిపురలో ప్రభావం చూపవచ్చని వెల్లడించారు. అండమాన్ దీవుల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.