హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తండాలకు కనీసం తాగునీరు కూడా అందడంలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్ మండిపడ్డారు. గతంలో ప్రతి ప్రభుత్వ మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాతినిధ్యం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వంలో లంబాడీలకు ఒక మంత్రిపదవి కూడా ఇవ్వలేదని, భవిష్యత్తులో లంబాడీలు కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొకడం ఖాయమని హెచ్చరించారు.
తెలంగాణభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, గిరిజన నేతలు పాల్గొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.