నాగర్ కర్నూల్ : జిల్లాలోని తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు (Congress leaders) సర్పంచ్ అభ్యర్థి చీర్ల సుధాకర్ తిరుపతమ్మ , శ్రీను,శివ, శ్రీశైలం, రాములు, ఉదయ్, నవీన్, శ్రీశైలం తదితరులు బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్కు స్వచ్ఛందంగా రాజీనామా చేశామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి జరుగలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పల్లెల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.