Allu Cinemas | టాలీవుడ్ సినీ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా (DOLBY CINEMA) స్క్రీన్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది అల్లు సినిమాస్. సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ భారీ తెరను తీసుకురాబోతుండగా.. ప్రపంచమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) సినిమాతో ఈ డాల్బీ స్క్రీన్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు (75 ft-wide) కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. . ఇది DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్లో ఉంటుంది. అద్భుతమైన విజువల్స్‌తో పాటు 3డీ అనుభవం కోసం ఇందులో అత్యుత్తమ #DolbyVisionతో పాటు #Dolby3D ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. సౌండ్ విషయానికొస్తే, దీనికి DolbyAtmos సౌండ్ సిస్టమ్ జతచేయబడింది, ఇది ప్రేక్షకులను సినిమా ప్రపంచంలోకి పూర్తిగా లీనం చేస్తుందని నిర్వహాకులు చెబుతున్నారు. అలాగే ప్రేక్షకులకు సౌకర్యవంతమైన వీక్షణ అనుభవం కోసం, థియేటర్లో ‘పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్’ (Pitch-black stadium seating) కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.