ఆర్మూర్, మార్చి 1: పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టకు టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను మంగళవారం ప్రారంభించింది. సిద్ధులగుట్టపైకి వచ్చిన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నడిపించారు. అనంతరం ఆల య కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి ప్రయాణించారు. సిద్ధులగుట్టకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించడంపై పట్టణ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తంచేస్తూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, తాటి హన్మాండ్లు, టీఆర్ఎస్ నాయకులు పోల సుధాకర్, జీజీరాం, బొబిడె గంగాకిషన్, మీరా హన్మంత్ పాల్గొన్నారు.