ఎల్లారెడ్డి రూరల్, జనవరి 18 : జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని ఎల్లారెడ్డి ఎస్సై మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌లో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారికి, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ద్విచక్రవాహనదారులకు ఈ-చలాన్ ద్వారా జరిమానా విధించారు. ప్రతిరోజూ వాహనాల తనిఖీ చేపడతామని, మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధిస్తామని అన్నారు.
వాహనాల తనిఖీ
తాడ్వాయి, జనవరి 18 : మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామసమీపంలో ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 15 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.