నిజాంసాగర్/ పిట్లం/తాడ్వాయి/లింగంపేట/ గాంధారి/ సదాశివనగర్/ అక్టోబర్ 30 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలను వేస్తున్నారు. నిజాంసాగర్ మండలంలోని లింగంపల్లి, అచ్చంపేట, మర్పల్లి గ్రామాల్లో వైద్యసిబ్బంది శనివారం ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమాన్ని తహసీల్దార్ నారాయణ పరిశీలించారు. ఆయన వెంట ఏఎన్ఎంలు ఫర్హానా, సునీత, ఆశకార్యకర్తలు నాగమణి, మమత ఉన్నారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్, కారేగాం, గోద్మేగాం గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను తహసీల్దార్ రామ్మోహన్రావు పర్యవేక్షించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు బలరాం, జాకీర్ హుస్సేన్, శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
తాడ్వాయి మండలపరిధిలోని బ్రాహ్మణపల్లి, ఎర్రాపహాడ్, దేమెకలాన్, తాడ్వాయి, కృష్ణాజివాడి గ్రామాల్లో వైద్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఎంపీవో ప్రభాకర్ చారి పరిశీలించారు.
గాంధారి మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, ఉత్తనూర్ ప్రభుత్వ దవాఖానతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా టీకాలు వేశామని వైద్యాధికారి హరికృష్ణ తెలిపారు. మండలంలో శనివారం 258 మందికి టీకాలు వేశామని తెలిపారు.
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రామారెడ్డి పీహెచ్సీ డాక్టర్ షాహిద్ అలీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి కొవిడ్ టీకాలను వేశారు. సర్పంచ్ పైడి జానకి, ఐకేపీ సీసీ అబ్బ లింగం, అంగన్వాడి టీచర్లతో కలిసి వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, వైద్య శాఖ సూపర్వైజర్ వెంకటమ్మ, ఏఎన్ఎం స్వరూప, వీవోఏలు శ్రీలత, ఎర్ర సునీత, గంగామణి, వరలక్ష్మి, ఆశవర్కర్లు అంజలి, అరుణ, గౌతమి, ప్రవళిక, పద్మలత, అంగన్వాడీ టీచర్లు సరోజ, బుజ్జి, శశిరేఖ, మంజుల, నర్సవ్వ, వీఆర్ఏలు నర్సింహులు, రవి, రేఖ, బీఎల్వోలు ప్రవీణ్, రఘు పాల్గొన్నారు.