నిజాంసాగర్/ పిట్లం/ సదాశివనగర్, అక్టోబర్ 30 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరను అందజేస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట, మాగి, నర్సింగ్‌రావుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు అనసూయ, రమేశ్, సత్యనారాయణ, దాచ కిషన్, గుమస్తా శ్రీను, కమ్మరికత్త అంజయ్య, గంగారాం, జగన్, రాములు, సాయిలు, పండరి, సీఈవో సంగమేశ్వర్‌గౌడ్, బేగరి రాజు, ఏవో అమర్‌ప్రసాద్, ఏఈవో స్వర్ణలత పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్, చిల్లర్గి, రాంపూర్, గౌరారం, గౌరారం తండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. చిన్నకొడప్గల్లో విండోచైర్మన్ నారాయణరెడ్డి, చిల్లర్గి రాంపూర్ గ్రామాల్లో చైర్మన్ శపథంరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్, బాబుసింగ్, లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సర్పంచులు నారాయణరెడ్డి, రమేశ్, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, సహకార సంఘాల డైరెక్టర్లు, కార్యదర్శులు హన్మాండ్లు, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలం పద్మాజివాడి విండో పరిధిలోని మోడెగామ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గైని అనసూయారమేశ్, పద్మాజివాడి విండో చైర్మన్ గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ తిరుమలమ్మ, వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి (లడ్డూ), ఎంపీటీసీ సభ్యురాలు జూకంటి సుజాతా బాపురెడ్డి, ఉపసర్పంచ్ రాజు, సదాశివనగర్ విండో చైర్మన్ కమలాకర్‌రావు, సీఈవో దేవేందర్ రావు, భరత్‌రెడ్డి, డైరెక్టర్లు భాస్కర్, సాయిలు, చిల్కూరి గంగారెడ్డి, కేసీ రాజిరెడ్డి, కుంట లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, నీలం రెడ్డి, కేసీ లింగారెడ్డి, జీజీ గంగాధర్, ఎల్పీ రాజిరెడ్డి, ఏఈవో స్నేహలత, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు, మామిడి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.